చిరు కంటే ముందు నానితో..!

koratala siva next movie with nani

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుతో ‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’ చిత్రాతో భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను దక్కించుకున్న కొరటాల శివ తన తదుపరి సినిమాను ఎవరితో చేస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదట అఖిల్‌తో కొరటాల శివ సినిమా ఉంటుందని భావించారు. కాని కొరటాల శివ ఆ వార్తలను కొట్టి పారేశాడు. తాను అఖిల్‌తో సినిమా చేయబోవడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా చిరంజీవితో కొరటాల శివ సినిమా అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమే అంటూ కాస్త అటు ఇటుగా కొరటాల శివ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి, విడుదలైన తర్వాత కొరటాల శివ సినిమా ఉంటుంది.

చిరంజీవి తర్వాత సినిమాకు రెడీ అవ్వాలంటే ఖచ్చితంగా కనీసం సంత్సరం సమయం పడుతుంది. ఈ గ్యాప్‌లో కొరటాల శివ ఒక చిత్రాన్ని చేయాలని ఫిక్స్‌ అయ్యాడు. ఆ సినిమాలో హీరోగా నాని నటించే అవకాశాు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కొన్ని వారాల క్రితం నాని హీరోగా కొరటాల శివ మూవీ అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజమే అని తాజాగా వెళ్లడైంది. ప్రస్తుతం నాగార్జునతో కలిసి శ్రీరాం ఆధిత్య దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నాని చేస్తున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నాని సినిమా ఉంటుందనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో నాని సినిమా చేస్తే అది బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవ్వడం ఖాయం, నాని కెరీర్‌ పీక్స్‌కు చేరడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.