లాల్ సింగ్ చడ్డా రివ్యూ హిట్టా ఫట్టా

లాల్ సింగ్ చడ్డా
లాల్ సింగ్ చడ్డా

ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లాల్‌సింగ్‌ చడ్డా’. కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు హిందీ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి అద్వెత్‌ చందన్‌ దర్శకత్వం వహించారు. వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి సమర్పిస్తుండటంతో టాలీవుడ్‌లో కూడా ‘లాల్‌సింగ్‌ చడ్డా’పై క్యూరియాసిటి పెరిగింది. దానికి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్‌ 11) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. లాల్‌సింగ్‌ చడ్డా స్టోరీ ఏంటి? ఎలా ఉంది? లాల్‌సింగ్‌గా ఆమిర్‌ ఏ మేరకు ఆకట్టుకున్నాడు తదితర విషయాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.

‘లాల్‌సింగ్‌ చడ్డా’ బ్యూటీఫుల్‌ ఫిల్మ్‌. థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా ఇది. ప్రేక్షకులు ఓ అందమైన ప్రయాణంలో మునిగిపోతారు. లాల్‌సింగ్‌గా ఆమిర్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అద్వెత్‌ చందన్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.

చాలా రోజుల తరువాత హిందీలో ఓ మంచి సినిమా చూశామంటూ నెటిజన్స్‌ చెబుతున్నారు. హృదయాన్ని హత్తుకునేలా లాల్ సింగ్ చడ్డా మూవీ ఉందంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఫస్టాఫ్‌ ఫ్లాట్‌గా ఉందని, ఇంటర్వెల్‌ సీన్‌ కూడా అందరిని ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ టచ్ తో ఆకట్టు కున్నారంటూ కామెంట్ చేస్తున్నారు.ఓవర్ ఆల్ గా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది లాల్ సింగ్ చద్దా..