“నందమూరి బాలకృష్ణ 109వ చిత్రంపై తాజా అప్డేట్!

Cinema News

నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “భగవంత్ కేసరి” తో తన కెరీర్ లో హ్యాట్రిక్ హిట్ ని సొంతం చేసుకోగా ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు కొల్లి బాబీ బాలయ్య కెరీర్ లో 109వ సినిమా ని తెరకెక్కిస్తుండగా దీనిపై హైప్ కూడా గట్టిగానే ఉన్నది . ఇక రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కాగా జెట్ స్పీడ్ లో షూట్ అయితే కొనసాగుతుంది.

“బాలయ్య 109” లేటెస్ట్ రూమర్ పై క్లారిటీ.!
Balakrishna

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం విషయంలో లేటెస్ట్ గా ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ అయితే స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా లో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తాడు అని రూమర్స్ మొదలయ్యాయి. మరి దీనిలో అయితే ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది . ప్రస్తుతానికి ఏ ఇతర యంగ్ హీరో ఈ మూవీ లో లేడని దుల్కర్ పై వస్తున్నా వార్తల్లో నిజం లేదని సమాచారం. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ని అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాదికి దీనిని ప్లాన్ చేస్తున్నారు.