ఎన్టీఅర్ బయోపిక్ గురించి తాజా అప్డేట్…!

NTR Biopic PRe Release Event

దివంగత నటుడు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వెండితెరపైనే కాకుండా తెలుగు ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఇప్పటికే ఈ సినిమా కోసం స్టార్ క్యాస్టింగ్ భారీ రేంజ్ లో ఉంది. దీంతో ఇప్పటి వరకూ ‘యన్‌.టి.ఆర్’ అని ఈ సినిమా పేరును ప్రచారం చేయగా దానికి కథానాయకుడు అనే క్యాప్షన్ తగిలించారు.

ntr-biopic

టైటిల్‌ను ఎన్టీఆర్ కథానాయకుడిగా మార్చడాన్ని బట్టి రెండు భాగాలుగా ఈ సినిమా ఉంటుందని భావిస్తున్నారు. రెండో భాగానికి యన్.టి.ఆర్ ప్రజానాయకుడు అని టైటిట్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు.. కానీ కథగా మారే నాయకుడొక్కడే వుంటాడు.. జనవరి 9 న అంటూ క్రిష్ అతన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేయనున్నామని డైరెక్టర్ క్రిష్ తెలిపాడు. ఆ టైటిల్ పోస్టర్ మీరు కూడా ఒక సారి చూసెయ్యండి మరి.

balakrishna