షారుఖ్ “పఠాన్” సీక్వెల్ పై లేటెస్ట్ అప్డేట్…!

షారుఖ్ “పఠాన్” సీక్వెల్ పై లేటెస్ట్ అప్డేట్...!
Cinema News

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకోణ్ హీరోయిన్ గా యాక్షన్ మూవీ ల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన భారీ హిట్ మూవీ “పఠాన్” కోసం అందరికీ తెలిసిందే. మరి బాలీవుడ్ మూవీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చిన బిగ్గెస్ట్ హిట్ అయితే ఈ మూవీ తోనే వచ్చింది.

షారుఖ్ “పఠాన్” సీక్వెల్ పై లేటెస్ట్  అప్డేట్...!
Shah Rukh Khan

అలా అక్కడ నుంచి మళ్ళీ బాలీవుడ్ మార్కెట్ కూడా ఫామ్ లోకి వచ్చింది. మరి ఈ మూవీ తో నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ వారు తమ సినిమాటిక్ యూనివర్స్ ను కూడా పరిచయం చేయగా మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సెన్సేషనల్ హిట్ కు సీక్వెల్ ని మేకర్స్ అప్పుడే కన్ఫర్మ్ చేయగా ఇప్పుడు దీనిపై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

దీనితో ఈ మూవీ ని మేకర్స్ ఈ ఏడాది లాస్ట్ లో అయితే స్టార్ట్ చేయనున్నారట. మరి ఈ మూవీ కోసం మరింత క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఫస్ట్ పార్ట్ తో బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ కొట్టిన షారుఖ్ పార్ట్ 2 తో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.