అఖిల్‌కు మంచి హిట్‌ రావాలి

అఖిల్‌కు మంచి హిట్‌ రావాలి

చిన్న వయస్సుల్లోనే ‘సిసింద్రీ’ సినిమాతో టాలీవుడ్‌ వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. ఇక తన పేరుతోనే రూపొందిన ‘అఖిల్’ అనే సినిమాతో ఆయన హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మరో ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ వంటి సినిమాల్లో నటించిన ఆయనకు ఒక సినిమా ద్వారా కూడా సరైన హిట్ లభించలేదు. ఇప్పుడు ఆయన నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని పట్టుదలతో ఉన్నారు.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మెరుగు కావడంతో సినిమా నుంచి ఒక్కొక్కటిగా వదులుతోంది చిత్ర యూనిట్. తాజాగా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘లెహరాయి’ ప్రోమోని విడుదల చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. ఈ పాట ప్రోమోలో హీరోయిన్ పూజా హెగ్డేతో అఖిల్ ఫూల్ రొమాన్స్ చేయడం మనం చూడొచ్చు.

ఇక ఈ పాట పూర్తి లిరికల్ వీడియోని సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రోమో చూసిన అభిమానులు ఈ సినిమా ద్వారా అఖిల్‌కు మంచి హిట్‌ రావాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటిదాకా చూపించని డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తున్నారని టాక్. చిత్రంలో అఖిల్, పూజా హెగ్డే రొమాంటిక్ డోస్ యూత్ ఆడియన్స్‌కి కిక్కివ్వబోతుందట. అక్టోబర్ 8న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.