లిసా టీజర్ – అంజలి బాగానే భయపెట్టింది.

Lisaa 3D - Official Teaser

తెలుగు నుండి తమిళంలోకి వెళ్లి బాగా పేరు సంపాదించుకున్న అంజలి నటిస్తున్న మరో హార్రర్ చిత్రం లిసా. ఇప్పటికే తెలుగు లో గీతాంజలి, చిత్రాంగద అనే హార్రర్ సినిమాల్లో నటించిన అంజలి తన ఫిజిక్ ని పూర్తిగా మార్చుకొని, సన్నబడ్డాక నటిస్తున్న ఈ లిసా సినిమాలో మకరంద్ దేశపాండే, యోగిబాబు ( కోకో కోకిల ఫేమ్) ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా మన కామెడీబ్రహ్మ బ్రహ్మానందం కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్రలో నటిస్తూ, నవ్వులు పంచేందుకు సిద్ధం అయ్యారు. ఈ సినిమాకి రాజు విశ్వనాధ్ దర్శకత్వం వహిస్తుండగా, పీజీ ముత్తయ్య నిర్మిస్తున్నారు.

Lisaa

ఇక టీజర్ సంగతికి వస్తే, ఈ టీజర్ లో దెయ్యాలని నమ్మని పాత్రలో అంజలి కనిపించిన కొన్ని క్షణాల్లోనే తాను ఉండే పాడుబడిన ఇంట్లో దెయ్యాల కదలికలను చూసి, భయపడుతున్న అంజలి పెర్ఫార్మన్స్ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. వీటికి తోడు సినిమా యొక్క నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఒక హార్రర్ కథాంశంని చెప్పడానికి కావాల్సిన మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, నటులు ఇవన్నీ సరిగ్గా కుదిరినట్టే కనిపిస్తుంది. ఇప్పటికైతే ఈ సినిమా తమిళ వెర్షన్ టీజర్ మాత్రమే రిలీజ్ అయ్యింది. అంజలి కి తెలుగు లో ఉన్న క్రేజ్ కారణంగా తెలుగులో కూడా ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా యొక్క మరొక్క ప్రత్యేకత ఏమిటంటే రియల్ 3డి లో సినిమా రూపొందడడం. కాబట్టి, భయపడే సన్నివేశాలు 3డి లో మరింత భయపెడతాయి. సన్నబడిన అంజలి చూడటానికి సగం వయసు తగ్గిన టీనేజ్ అమ్మాయి లా కనిపించడం మరో ఆకర్షణ.