యువతి మీద ప్రేమికుడి లైంగిక దాడి…సహకరించిన తల్లి

lover sexual assault on the girl

ప్రేమ, పెళ్లి పేరు చెప్పి ఓ యువతిని ఇంటికి తీసుకొచ్చిన కొడుకు ఆమె మీద లైంగిక దాడికి  పాల్పడుతుంటే, కొడుకును మందలించాల్సిన తల్లి సహకరించిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఈ విషయంలో పోలీసు కేసు నమోదు కావడంతో హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. కేసు తమ దృష్టికి రాగానే స్పందించి ఇద్దరినీ రిమాండ్ కు పంపారు. పోలీసుల వివరాల ప్రకారం కాప్రాకు చెందిన ఓ యువతి (18), ఒక జూనియర్ కాలేజీలో రిసెప్షనిస్ట్ గా పని చేస్తుండగా, నాచారానికి చెందిన అబ్దుల్ మజీద్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.  ఈ పరిచయం ప్రేమగా మారగా, పలుమార్లు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లిన మజీద్ శారీరక వాంఛలను తీర్చుకున్నాడు. ఆ సమయంలో వీడియోలు, ఫొటోలు తీసుకున్నాడు. తర్వాత పెళ్లి చేసుకోవాలని బాధితురాలు నిలదీయగా,  నిరాకరిస్తూ, తన వద్ద వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అలా బెదిరించి ఆమె నుండి రూ..60 వేల నగదును,  ఏడున్నర గ్రాముల దాకా బంగారాన్ని తీసుకున్నాడు. ఇందుకు అతని తల్లి సలేహా తన వంతు సహకారాన్ని అందించింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులిద్దరినీ అరెస్ట్ చేశామని, వారి నుంచి బంగారంతో పాటు బైక్, కారు, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.