పసిమొగ్గపై కామాంధుడు లైంగిక దాడి

పసిమొగ్గపై కామాంధుడు లైంగిక దాడి

పసిమొగ్గపై కామాంధుడు లైంగిక దాడికి పాల్పడి శరీరంపై కాట్లు పెట్టి వికృతంగా వ్యవహరించిన దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ తాలూకాలోని గంటికేరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.

ఆ గ్రామానికి చెందిన 30 సంవత్సరాల వ్యక్తి మద్యం మత్తులో పొరుగింటిలో ఉంటున్న చిన్నారిని నిర్బంధించాడు. వికృతంగా వ్యవహరించాడు. కుటుంబ సభ్యులు చిన్నారి ఒంటిపై ఉన్న గాయాలు చూసి ఆరా తీయగా ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా చిన్నారిని ఆస్పత్రికి తరలించి నిందితున్ని పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేశారు.