కూతురుని తుపాకితో కాల్చిచంపిన తండ్రి

కూతురుని తుపాకితో కాల్చిచంపిన తండ్రి

ఇంట్లోకి ఆగంతకులు చొరబడ్డారన్న అనుమానంతో తన 16 ఏళ్ల కూతురుని తుపాకితో కాల్చిచంపిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. ఇంట్లోని అలారం మోగడంతో ఎవరో ఆగంతకులు చొరబడ్డారని ఆమె తండ్రి కాల్పులు జరిపాడు. కాసేపటి తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా తన కూతరు జానే హెయిర్‌స్టన్‌ అక్కడ పడిపోయిఉండటాన్ని తల్లిదండ్రులు గమనించారు.

ఈ ఘటనపై బుధవారం ఉదయం 4:30గంటల ప్రాంతంలో ఆమె తల్లి అత్యవసర సేవలకు కాల్‌చేసి తెలియజేసింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, అత్యవసర బృందం సాయంతో ఆమెను స్థానిక ఆ‍స్పత్రికి తరలించారు. అక్కడ హెయిర్‌స్టన్‌ చికిత్స పొందుతూ 5:42 గంటల ప్రాంతంలో మరణించినట్లు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.