మంచు విష్ణు “భక్త కన్నప్ప” లో మళయాళ మెగాస్టార్.!

మంచు విష్ణు “భక్త కన్నప్ప” లో మళయాళ మెగాస్టార్.!
Latest News

మన టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు ఇప్పుడు తన డ్రీం ప్రాజెక్ట్ సినిమా భక్త కన్నప్ప చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమా నిర్మాణం వహిస్తుండగా ఈ సినిమా కి అయితే తాము భారీ బడ్జెట్ పెట్టి భారీ తారాగణంతో పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ మూవీ స్టార్ట్ చేయడంతోనే మొట్ట మొదట పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పేరు బయటకి వచ్చి సెన్సేషన్ కాగా మరింత మంది బిగ్ స్టార్ లు పేరు ఈ చిత్రం నుంచి ఉంటాయని కూడా బజ్ వచ్చింది.

మంచు విష్ణు “భక్త కన్నప్ప” లో మళయాళ మెగాస్టార్.!
Manchu Vishnu

మరి ఇప్పుడు దానిని నిజం చేస్తూ ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ అయినటువంటి మోహన్ లాల్ కూడా నటిస్తున్నట్టుగా వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి. దీనితో ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకి అయితే మోహన్ లాల్ ఓకే చెప్పారని దీనితో తన ప్రెజెన్స్ కూడా ఈ మూవీ లో ఉంటుంది అని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. మొత్తానికి అయితే మంచు వారు ఈ సినిమా ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి.