ఓటిటిలో “మంగళవారం” సినిమా ..ఎప్పుడంటే .?

ఓటిటిలో “మంగళవారం” సినిమా ..ఎప్పుడంటే .?
Cinema News

రీసెంట్ గా మన టాలీవుడ్ లో వచ్చి సూపర్ హిట్ అయ్యిన క్రేజీ థ్రిల్లర్ సినిమా ల్లో టాలెంటెడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మరియు టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి లు మెయిన్ లీడ్ లో దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ డ్రామా “మంగళవారం” కూడా ఒకటి. మరి అన్ని అంచనాలు అందుకున్న ఈ సినిమా తో పాయల్ రాజ్ పుత్ సహా దర్శకుడు అజయ్ భూపతి కూడా మంచి కం బ్యాక్ ని ఇచ్చారు.

ఓటిటిలో “మంగళవారం” సినిమా ..ఎప్పుడంటే .?
Mangalavaram Movie

అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ ఎప్పుడు అనేది ఇప్పుడు బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా ఓటిటిలో ఈ డిసెంబర్ 22న రిలీజ్ కానున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా దీనిపై అధికారిక క్లారిటీ కూడా రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమా కి అజనీష్ లోకనాథ్ ఒక మెంటల్ మాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అందించగా మధుర మీడియా వర్క్స్ నిర్మాణం వహించారు.