డబుల్ ఇస్మార్ట్ కోసం “మణిశర్మ”..నిజమేనా..?

డబుల్ ఇస్మార్ట్ కోసం “మణిశర్మ”..నిజమేనా..?
Cinema News

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా మార్చ్ 8, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కి సంబందించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ తాజాగా వెల్లడించారు.

డబుల్ ఇస్మార్ట్ కోసం “మణిశర్మ”..నిజమేనా..?
Double Ismart

ఈ సినిమా కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి జగన్నాథ్, మణిశర్మ కాంబినేషన్ లో వచ్చిన సినిమా లు మ్యూజికల్ గా ఎంతో పేరు తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే.