తమ్ముడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు……

తమ్ముడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు......

మంజులగా కంటే కృష్ణ కూతురిగా, మహేష్ సోదరిగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తన తండ్రి, తమ్ముడి గురించి తరచుగా మాట్లాడుతుంటుంది. ముఖ్యంగా మహేష్ గురించి మాట్లాడితే రీచ్ ఎక్కువ కాబట్టి అతడి గురించి వీలు చిక్కినపుడల్లా చర్చిస్తుంటుంది. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె.. తమ్ముడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది మంజుల.

మహేష్ తన కంటే చిన్నవాడే కానీ.. తనకంటే అతడికి మెచ్యూరిటీ ఎక్కువ అని ఆమె వ్యాఖ్యానించింది. తన కెరీర్ విషయంలో, వ్యక్తిగత జీవితంలో మహేష్ అనేక విలువైన సలహాలు ఇస్తుంటాడని ఆమె అంది. మహేష్‌కు సంబంధించిన అనేక సీక్రెట్లు ఉన్నాయని.. వాటిని అభిమానులతో త్వరలో పంచుకుంటానని అంది. బహుశా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారానే మంజుల ఈ విషయాలన్నీ చెబుతుందేమో చూడాలి.