మాస్ చిత్రంతో అలరించబోతున్న తలైవా

మాస్ చిత్రంతో అలరించబోతున్న తలైవా

సన్ పిక్చర్స్ నిర్మాణంలో మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో తలైవా రజిని కాంత్ హీరోగా ఒక సినిమా రానుంది. తమిళ దర్శకుడు శివ మాస్ చిత్రాలతో చాలా పేరు సంపాదించాడు.గత కొన్ని రోజులుగా దర్శకుడు శివ తలైవా రజిని కాంబినేషన్ లో మూవీ వస్తున్న వార్తలపైన సోషల్ మాధ్యమాలలో పోస్ట్ చేసిన వీడియో ద్వారా ఒక స్పష్టత వచ్చింది. ప్రస్తుతం రజనీ సెట్స్ పైన రానున్నదర్బార్ మూవీ మూవీలో బిజీగా ఉన్నారు.రజిని నటిస్తున్న దర్బార్ మూవీ సంక్రాంతి కానుకగా రానుంది. మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చిత్రం తెరకెక్కనుంది.

డైరెక్టర్ శివ తలఅజిత్ తో వీరం,వేదాళం,వివేకం,విశ్వాసం వంటి మాస్ కినేమాలకి దర్శకత్వం వహించారు. అజిత్, డైరెక్టర్ శివ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రాలు చాలా హిట్ సాదించాయి.రజినితో డైరెక్టర్ శివ మొదటిసారి చేయబోనున్న కొత్త చిత్రం వచ్చే ఏడాది వేసవిలో భారీ అంచనాలతో విడుదలయ్యే అవకాశం ఉంది.