గన్నవరంలో భారీ అగ్ని ప్రమాదం

గన్నవరంలో భారీ అగ్ని ప్రమాదం

గన్నవరం మండలం తెంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌తో విజయ పాలిమర్స్‌ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ వ్యాపించింది. పక్కన పలు ఫ్యాక్టరీలు ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.