మెగా హీరో – బాలీవుడ్ భామ : ఒక కొత్త కథ!

మెగా హీరో - బాలీవుడ్ భామ : ఒక కొత్త కథ!
Cinem News

చరణ్ ప్రస్తుతం తన 15వ సినిమా పనులతో చాలా బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో .. పాన్ ఇండియా సినిమా స్థాయిలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగు చివరి దశలో ఉండగానే, ఆ తరువాత ప్రాజెక్టు ని చరణ్ లైన్లో పెట్టేశాడు. ఈ సినిమాకి బుచ్చిబాబు దర్శకత్వం వహించనున్నాడు.

ఇప్పుడు చరణ్ కి ఇది 16వ సినిమా. ఈ సినిమా ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని పాత్రలకి సంబంధించి, విజయనగరం .. విశాఖపట్నం .. శ్రీకాకుళం .. సాలూరు ప్రాంతాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ మూవీ లో చరణ్ చాలా కొత్తగా కనిపిస్తాడని అంటున్నారు.

ఈ మూవీ లో హీరోయిన్ ఎవరనే విషయంపై కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. తాజాగా జాన్వీ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ మూవీ కోసం ఆమెను ఎంపిక చేయడం ఆల్రెడీ జరిగిపోయిందని అంటున్నారు. ఈ జోడీ పట్ల ఆడియన్స్ ఉత్సాహంగా ఉన్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సిఉంది .