వ్యాక్సినేషన్‌ వేయించుకున్న కేటీఆర్

వ్యాక్సినేషన్‌ వేయించుకున్న కేటీఆర్

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాక్సినేషన్‌ వేయించుకున్నారు. రెండో డోసు శుక్రవారం వేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా తెలిపారు. ‘రెండో వ్యాక్సిన్‌ పూర్తి’ చెబుతూ రెండు ఫొటోలను కూడా పంచుకున్నారు.

అయితే దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఏకంగా 2.3 కోట్ల మంది వ్యాక్సిన్‌ వేసుకోవడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక చర్యలతో వ్యాక్సినేషన్‌ చేశారు. దీంతో పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ వేశారు. అయితే అది కాకతాళీయమో ఏమో తెలియదు కానీ ప్రధాని జన్మదినాన వ్యాక్సిన్‌ వేసుకోవడం విశేషం.