బాలయ్య నీ ప్లాన్‌ అదుర్స్‌… మోక్షజ్ఞ ఎంట్రీ గురించి

mokshagna entry with NTR Biopic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి బాలకృష్ణ తన తండ్రి తారకరామారావు జీవిత చరిత్రతో ఒక సినిమాను తెరకెక్కించేందుకు గత సంవత్సర కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవలే తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర తెరకెక్కించేందుకు సిద్దం అయ్యాడు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఇక మరో వైపు నందమూరి బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి కూడా చాలా తపన పడుతున్నాడు. ఎలాంటి కథతో మోక్షజ్ఞను తీసుకు రావాలా అని గత రెండు మూడు సంవత్సరాలుగా బాలకృష్ణ సన్నిహితులతో చర్చల మీద చర్చలు జరుపుతున్నాడు. ఎట్టకేలకు బాలకృష్ణకు ఒక రూట్‌ దొరికింది. మోక్షజ్ఞ ఎంట్రీని తన తండ్రి ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఉండాలని బాలయ్య ఫిక్స్‌ అయ్యాడు,..

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ యంగ్‌ ఏజ్‌లో ఉన్నప్పటి పాత్రను మోక్షజ్ఞతో నటింపజేయనున్నాడు. సినిమాల్లో సీనియర్‌ అయిన తర్వాత, రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పాత్రలో బాలకృష్ణ నటించబోతున్నాడు. మొదటి సినిమానే ఏన్టీఆర్‌ పాత్ర చేయడం అంటే గొప్ప విషయం. అందుకే మోక్షజ్ఞ ఎంట్రీ ఇని ఇలా ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది. వచ్చే సంవత్సరం వేసవి సమయానికి సినిమా సెట్స్‌పైకి వెళ్లేలా బాలయ్య ప్లాన్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ విదేశాల్లో నటన మరియు దర్శకత్వంలో శిక్షణ పొందుతున్నాడు. యాక్షన్‌ మరియు డాన్స్‌లలో కూడా మోక్షజ్ఞ పర్‌ఫెక్ట్‌ అయినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

ఒక చిన్న పాత్రలో పది లేదా పదిహేను నిమిషాల పాటు మోక్షజ్ఞను ఎన్టీఆర్‌ బయోపిక్‌లో చూపించనున్నారు. మోక్షజ్ఞ కూడా ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఉంటే ఖచ్చితంగా ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ దక్కే అవకాశం ఉంది. అందుకే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎన్టీఆర్‌ బయోపిక్‌తో అయితే అన్ని విధాలుగా మంచిది అని బాలయ్య ఈ నిర్ణయానికి వచ్చాడు. అందుకే బాలయ్య ప్లాన్‌ అదుర్స్‌ అంటూ ఆయన సన్నిహితులు అభినందిస్తున్నారు.