యువతని ఆకట్టుకుంటున్న గుజ‌రాతీ భామ

యువతని ఆకట్టుకుంటున్న గుజ‌రాతీ భామ

బిగ్‌బాస్ అంటేనే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, అన్ని ర‌కాల ఎమోష‌న్స్‌కు సింగిల్ స్టాప్ అంటారు. అదేంటో కానీ ఈసారి సీజ‌న్‌లో మాత్రం ఎవ‌రిని క‌దిలించినా క‌న్నీళ్లే.. అస‌లు క‌దిలించ‌క‌పోయినా ఏడుపులు పెడ‌బొబ్బ‌లే. షో ప్రారంభ‌మైన నాటి నుంచి కొన‌సాగుతున్న ఈ అర్థం ప‌ర్థం లేని ఏడుపులను ప్రేక్ష‌కులు భ‌రించ‌లేక‌పోతున్నారు. ముఖ్యంగా మిస్ గుజ‌రాతీ భామ మోనాల్ గ‌జ్జ‌ర్‌ అంద‌రినీ దాటి క‌న్నీటి కిరీటాన్ని అందుకునేలా ఉంది.

బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట‌రైన మొద‌టి రోజే త‌న కుటుంబం, తండ్రి గురించి చెప్తూ ఒక్క‌సారిగా ఏడ్చేసింది. రెండోరోజు వెజ్‌, నాన్‌వెజ్ సెప‌రేట్‌గా వండ‌మ‌ని కోర‌గానే, మ‌రో మాట చెప్ప‌కుండా అంద‌రూ ఓకే అన్నారు. అయినా స‌రే మ‌ళ్లీ ఏడుస్తూ చెప్పిందే చెప్పి అంద‌రికీ విసుగు తెప్పించింది. ఎప్పుడు చూసినా మోనాల్ ఏడుస్తూనే ఫుటేజీ ద‌క్కించుకుంటోంది. దీంతో పాతాళ‌గంగ బిరుదు సంపాదించుకున్న శివ‌జ్యోతిని మోనాల్ మించిపోయింద‌ని సోష‌ల్ మీడియాలో ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. పైగా హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడుతుండ‌టం కూడా ఆమెకు మైన‌స్ అవుతోంది. మున్ముందైనా ఆమె ఏడుపు కంట్రోల్ చేసుకుంటుందో, లేక‌ షో ఆసాంతం ఇలానే క‌న్నీళ్ల‌తో నెట్టుకొస్తుందో చూడాలి.