త‌న పెళ్ళి ఇప్పుడే కాద‌న్న శృతి హాస‌న్

my marriage is not now says shruthi hasan

అందాల తార శృతి హాసన్ దాదాపు రెండేళ్ళ నుండి సినిమాలకి దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మైఖేల్ కోర్సెల్ అనే వ్య‌క్తితో ప్రేమాయ‌ణంలో ప‌డ్డ త‌ర్వాత శృతి ఆయ‌న‌తో స‌ర‌దాగా చెట్టాప‌ట్టాలు వేసుకుంటూ షికార్లు చేసింది. ఇటీవ‌ల వీరిద్దరి ప్రేమ‌కి ఎండ్ కార్డ్ ప‌డింది. దీంతో మ‌ళ్ళీ సినిమాల‌పై దృష్టి సారించింది. ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో విజయ్‌సేతుపతి సరసన లాభం అనే చిత్రం, టాలీవుడ్‌లో రవితేజతో ఒక చిత్రం చేయ‌నుంది. అదీ కాక అమెరికాకి చెందిన ‘ట్రెడ్‌స్టోన్‌’లో శృతి హాస‌న్ కీల‌క పాత్ర ఎంపికైంది. అంతర్జాతీయ వెబ్ సిరీస్‌గా రూపొంద‌నున్న ట్రెడ్ స్టోన్‌ని రామిన్ బ‌హ్రానీ తెరకెక్కించ‌నున్నారు. ఢిల్లీలో ఒక హోటల్‌లో వెయిట్రెస్‌గా పని చేస్తూ ర‌హ‌స్యంగా హత్యలు చేసే యువతిగా శృతి నటించనుందని సమాచారం. నీరా ప‌టేల్ అనే పాత్ర‌లో శృతి క‌నిపించ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, ప్ర‌స్తుతం త‌న పాత్ర‌కి బంధించిన ప్రిప‌రేష‌న్‌లో ఉంద‌ట శృతి. అయితే తాజాగా ఈ అమ్మ‌డిని ఓ నెటిజ‌న్ పెళ్లెప్పుడు చేసుకుంటారు, అదెప్పుడో చెబితే అభిమానుల‌మైన మేమంతా పాల్గొంటాం అని అన్నాడు. దీనిపై స్పందించిన శృతి.. వివాహానికి చాలా రోజుల స‌మ‌యం ఉంది. బ‌ర్త్‌డేకి రండి.. అంద‌రి క‌లిసి క‌ట్టుగా జ‌రుపుకుందాం అని బ‌దులిచ్చింది.