సెన్సార్ ని పూర్తి చేసుకున్న “నా సామిరంగ”

సెన్సార్ ని పూర్తి చేసుకున్న “నా సామిరంగ”
Cinema News

టాలీవుడ్ స్టార్ హీరో, అక్కినేని నాగర్జున ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ నా సామిరంగ. ఈ మూవీ కి సంబందించిన ట్రైలర్ ని మేకర్స్ నేడు రిలీజ్ చేయగా, ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది . ఈ మూవీ థియేట‌ర్లలో విడుద‌ల కావ‌డానికి ఐదు రోజుల ముందే ఈ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది.

సెన్సార్  ని పూర్తి చేసుకున్న “నా సామిరంగ”
Naa Saami Ranga

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ విలేజ్ యాక్షన్ డ్రామాకి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. మూవీ యొక్క ఆమోదించబడిన రన్‌టైమ్ 146 నిమిషాలు (2 గంటల 26 నిమిషాలు). ఈ మూవీ లో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లాన్ మరియు నాజర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాస చుట్టూరి ఈ ప్రాజెక్ట్‌ని బ్యాంక్రోల్ చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది .