2018లో నాగచైతన్య అయిదు..!

naga chaitanya release 5 movies in 2018

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవలే స్టార్‌ హీరోయిన్‌ సమంతను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత నెల రోజులు గ్యాప్‌ ఇచ్చిన నాగచైతన్య తాజాగా ‘సవ్యచాసి’ అనే చిత్రాన్ని మొదలు పెట్టాడు. శరవేగంగా చిత్రాన్ని పూర్తి చేసి ఆ వెంటనే మారుతి దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ‘శైలజ రెడ్డి అల్లుడు’ అనే టైటిల్‌తో నాగచైతన్య సినిమా తెరకెక్కబోతుంది. భారీ అంచనాల నడుమ ఈ రెండు సినిమాలు చేస్తున్న నాగచైతన్య మరో మూడు సినిమాలకు కూడా కమిట్‌ అయినట్లుగా సమాచారం అందుతుంది.

నానితో ‘మజ్ను’ చిత్రాన్ని చేసి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విరించి వర్మ దర్శకత్వంలో నాగచైతన్య ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. ఇటీవలే కథ కూడా ఫైనల్‌ అయ్యింది. వచ్చే సంవత్సరం ఆరంభంలోనే సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నారు. ఇక తమిళంలో తెరకెక్కి సక్సెస్‌ అయిన ఒక సినిమాను వెంకటేష్‌తో కలిసి చేసేందుకు నాగచైతన్య గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. త్వరలోనే ఆ సినిమాపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు తనకు సక్సెస్‌ ఇచ్చిన కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమాను చేసేందుకు కూడా నాగచైతన్య సిద్దంగా ఉన్నాడు. ఇలా వరుసగా నాగచైతన్య చిత్రాలు చేస్తూ దూసుకు పోతూ ఉన్నాడు. వచ్చే సంవత్సరంలో ఖచ్చితంగా అయిదు సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.