నాగచైతన్య నటించిన ‘దూత’ ఓటిటిలో ప్రసారమవుతోంది

నాగచైతన్య నటించిన 'దూత' ఓటిటిలో ప్రసారమవుతోంది
Dhootha Web Series

అక్కినేని నాగ చైతన్య తొలిసారిగా నటించిన దూత వెబ్ సిరీస్ పై మొదటి నుండి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో మంచి అంచనాలు నెలకొన్నాయి . నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శరత్ మరార్ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ థ్రిల్లింగ్ సస్పెన్స్ యాక్షన్ సిరీస్ కి ఇషాన్ చాబ్రా సంగీతం అందించగా మీకొలాజ్సైగల ఫోటోగ్రఫి అందించారు.

నాగచైతన్య నటించిన 'దూత' ఓటిటిలో ప్రసారమవుతోంది
Dhootha Web Series

ఇక నేడు కొద్దిసేపటి క్రితం దూత సిరీస్ ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చేసింది. విక్రమ్ కుమార్ కథ, దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మొత్తంగా 8 ఎపిసోడ్స్ గా ఐదు పాన్ ఇండియన్ భాషల్లో అందుబాటులో ఉండగా ప్రతి ఎపిసోడ్ యొక్క ఎండింగ్ లో ఆకట్టుకునే ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా ఉంటాయని, తప్పకుండా ఆడియన్స్ తమ సిరీస్ కి మంచి ఆదరణ అందిస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తోంది దూత టీమ్. మరి ఈ సిరీస్ ఏస్థాయి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.