నాగచైతన్య యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు

నాగచైతన్య యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు
Cinema News, Entertainment

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అక్కినేని నాగచైతన్య “ధూత“మూవీ తో డిజిటల్ వరల్డ్​లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా చై చాలా సిగ్గరి. సినిమా ప్రమోషన్స్​ కోసం తప్ప దాదాపుగా ఆయన సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్​గా ఉండడు. తన పర్సనల్ విషయాలు కూడా ఎక్కువగా షేర్ చేసుకోవడానికి ఇష్టపడడు. అలాంటి చై తాజాగా యూట్యూబ్ వరల్డ్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. యూట్యూబ్​లో ఒక ఛానెల్ స్టార్ట్ చేశాడు. అక్కినేని నాగచైతన్య పేరుతో యూట్యూబ్ ఛానెల్​ను ప్రారంభించిన చై.. శుక్రవారం రోజున అందులో తొలి వీడియో షేర్ చేశాడు. హాయ్ యూట్యూబ్ అంటూ తన అభిమానులకు తన ఛానెల్​ను పరిచయం చేశాడు.

video : https://youtu.be/icpjikJyDi8

నాగచైతన్య యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు
Naga Chaitanya

ఈ వీడియోలో చై అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఒక నెటిజన్ జుట్టు, గడ్డం పెంచడానకి రీజన్ ఏంటి అని అడగ్గా.. ఆరు నెలలుగా పని లేక ఖాళీగా ఇంట్లో కూర్చున్నాను అని .. అందుకే పెంచానని సరదాగా చెప్పాడు . ఆ తర్వాత చందూ మొండేటి దర్శకత్వంలో తాను నటిస్తున్న ఒక సినిమా కోసం పెంచినట్లు అసలు సంగతి తెలిపాడు.