సాక్షి పై కేసు పెట్టిన నారా లోకేష్

సాక్షి పై కేసు పెట్టిన నారా లోకేష్

చినబాబు చిరు తిండి రూ. పాతిక లక్షలంటూ  సాక్షి మీడియా ఓ డాక్యుమెంట్‌ను సగం ప్రచురించి విశాఖ విమానాశ్రయంలో ఓ హోటల్‌ బిల్లు చూపించి లోకేష్‌పై భారీ కథనం రాసింది. దాని ఆధారంగా. వైసీపీ నేతలు విమర్శలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్టూన్లు వేసింది. మీమ్స్ తయారు చేసింది. తీరా చూస్తే ఆ పాతిక లక్షలు  రూ. ఐదేళ్లలో ప్రోటోకాల్ వ్యక్తులకు సంబంధించిన మొత్తం ఖర్చు అని తేలింది. విమానాశ్రయానికి ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులకు సరఫరా  టీ, కాఫీ, స్నాక్స్ సరఫరా చేస్తారు.

అలా ఐదేళ్ల పాటు కొన్ని వేల మంది వచ్చి ఉంటారు. గత ప్రభుత్వంలో విశాఖలో అనేక అంతర్జాతీయ ఈవెంట్లు జరిగాయి. ఇలా వచ్చిన వారికి అయిన రూ. పాతిక లక్షల బిల్లు మొత్తం లోకేష్ ఖాతాలో వేసి సాక్షి మీడియా ఆయనపై మరకలు పూసేసింది. వ్యక్తిత్వ హత్య చేయడంలో సాక్షి మీడియా స్టైలే అలా ఉంటుంది కాబట్టి  టీడీపీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. కథనం  అందులో ఉన్న వాస్తవాలు ప్రచురించిన దురుద్దేశం ఇలా ప్రతీ ఒక్క విషయాన్ని బయట పెట్టి  ప్రెస్ కౌన్సిల్ సహా ఇతర బాధ్యులన్నింటికీ ఫిర్యాదులు చేయాలని నిర్ణయించుకుంది. వాటితో పాటు లోకేష్ న్యాయపోరాటం ప్రారంభించారు. సాక్షి యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపించారు. తనపై రాసిన అసత్య కథనానికి వివరణ కోరారు.

గడువులోగా వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లోకేష్  ఈ కథనంపై న్యాయపరమైన చర్యలు తీసుకునే విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే న్యాయనిపుణులతోనూ సంప్రదించారు. మీడియా స్వేచ్చ పేరుతో ఓ వ్యక్తి వ్యక్తిత్వాన్ని  నిజాలు తెలిసినా దాచి పెట్టి మరీ హత్య చేసే ప్రయత్నం చేయడం ఏ న్యాయస్థానం సమర్థించబోదన్న నిర్ణయానికి వచ్చారు. అధికారంలో ఉండి నిజాలు తెలిసి మరీ సాక్షి మీడియా ఇలా చేయడం సాధారణ ప్రజల్లోనూ విస్మయానికి కారణం అయింది. లీగల్ నోటీసులకు సాక్షి యాజమాన్యం స్పందించిన తర్వాత లోకేష్ పరువు నష్టం దావా వేయడం ఖాయంగా కనిపిస్తోంది.

/