NTR 30 – పబ్లిక్ టాక్

NTR-30 - పబ్లిక్ టాక్
NTR-30 - పబ్లిక్ టాక్

RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయి లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఎన్టీఆర్. ఇప్పుడు రాబోతుంది తన లేటెస్ట్ మూవీ “NTR 30”. కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం NTR 30. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం మరియు ఎన్టీఆర్ అరారార్ తర్వాత నటిస్తున్న మొదటి చిత్రం కాబట్టి, పాన్ ఇండియా స్థాయిలో బారి బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం పై బారి అంచనాలు ఉన్నాయి.

అరారార్ తర్వాత దాదాపు ఏడాది వ్యవధితో, స్క్రిప్ట్ పై పక్క కాంఫిడెన్స్ వచ్చిన తర్వాతే ఈ చిత్రం సెట్స్ లో మార్చ్ 23న అడుగు పెట్టారు తారక్. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ వస్తా నెట్టింట వైరల్ గ మారింది. అదేంటంటే… ఈ చిత్రం లో యంగ్ టైగర్ డ్యూయల్ రోల్ పోషించనున్నడంట. అది కూడా తండ్రి తనయులుగా. ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి గా కనిపించనున్నాడని టాక్.

‘ఫార్‌ అక్రాస్‌ కోస్టల్‌ ల్యాండ్స్ ఆఫ్‌ ఇండియా, ఫర్‌గాటెన్‌ ల్యాండ్స్‌లో తెర‌కెక్క‌నున్న క‌థ‌. మనుషుల కంటే ఎక్కువ భయమంటే తెలియని మృగాలతో ఈ చిత్రం నిండి ఉంటుందంట సముద్ర తీరం లో ప్రజలు పడే కష్టాలు మరియు స్మగ్గ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట.

ఎన్టీఆర్‌ సరసన జాన్వీ క‌పూర్ న‌టిస్తోన్న ఈ సినిమాని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌రికృష్ణ‌.కె. సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5, 2024లో ఈ చిత్రం తెరకెక్కనుంది.