ప్రస్తుతానికి టీజర్‌ మాత్రమే..!

ntr-biopic-shooting-under-progress

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్రం షూటింగ్‌ నేడు లాంచనంగా రామకృష్ణ సినీ స్టూడియోలో ప్రారంభం అయ్యింది. తేజ దర్శకత్వంలో సాయి కోర్రపాటి, విష్ణులతో కలిసి బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. హఠాత్తుగా ఈ చిత్రాన్ని సెట్స్‌ పైకి తీసుకు వెళ్లడంతో అంతా కూడా షాక్‌ అవుతున్నారు. తేజ, వెంకటేష్‌ల కాంబో మూవీ షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత బాలయ్యతో ఎన్టీఆర్‌ బయోపిక్‌ను తేజ మొదలు పెట్టబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని అనూహ్యంగా నేడు ప్రారంభించడంతో అంతా కూడా షాక్‌ అవుతున్నారు.

balakrishna-and-teja-direct

ప్రస్తుతం చిత్రీకరించేది కేవలం టీజర్‌ కోసమే అని, ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్బంగా టీజర్‌ను జనవరి 18న విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వారం రోజుల పాటు టీజర్‌ కోసం షూటింగ్‌ చేస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి లేదా మార్చిలో రెగ్యులర్‌ చిత్రీకరణ ఉంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు. టీజర్‌ను చాలా విభిన్నంగా, అందరిని ఆకట్టుకునే విధంగా తేజ ప్రత్యేకంగా షూట్‌ చేయబోతున్నాడు.

ntr-biopic-movie-teaser-rel

దాదాపు నిమిషం లేదా 70 సెకన్ల పాటు టీజర్‌ను ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌లో అసలు బాలయ్య ఏం చూపాలనుకుంటున్నాడు అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌ జీవితం ఎక్కడ నుండి ఎక్కడ వరకు అనేది కూడా టీజర్‌లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌ జయంతి సందర్బంగా సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌ చేస్తున్నారు. అది సాథ్యం అయ్యేనో లేదో చూడాలి.