జైలవకుశ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

NTR Jai Lava Kusa Movie First Review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విడుదలకి ఒక్క రోజు ముందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జైలవకుశ రివ్యూ బయటికి వచ్చింది. స్టార్ హీరోల సినిమాలకి ముందుగానే రివ్యూ,రేటింగ్ ఇచ్చే బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు జైలవకుశ చూసి ముందుగానే తన అభిప్రాయం ఏంటో చెప్పేసారు.

జైలవకుశ కధలో, స్క్రీన్ ప్లే లో ప్రేక్షకుడుని అలరించే ఎన్నో మలుపులు,మెరుపులు వున్నాయట. ఇక ఈ కధ, కధనాన్ని నడపడంలో దర్శకుడు బాబీ డిటెక్షన్ ఫస్ట్ రేట్ గా ఉందని సందు కితాబు ఇచ్చాడు. జైలవకుశ లో ఫైట్స్, ముఖ్యంగా క్లయిమాక్స్ గురించి ఉమైర్ ఆకాశానికి ఎత్తాడు. ఇద్దరు కధానాయికలు రాశీ ఖన్నా, నివేద థామస్ బాగా చేసారని సందు చెప్పాడు.

ఇక ఎన్టీఆర్ నటన, డాన్స్, ఫైట్స్ ఈ సినిమాలో ఓ పండగలా వుంటాయని ఉమైర్ పొగడ్తల వర్షం కురిపించాడు. కామెడీ,యాక్షన్ డ్రామాతో పాటు కొన్ని పాటల్లో ఎన్టీఆర్ చేసిన మూవ్మెంట్స్ చూస్తే ఫాన్స్ ఫిదా అయిపోతారంట. ఎన్టీఆర్ అద్భుతంగా మూడు పాత్రలు పోషించాడని ఉమైర్ అంటున్నాడు.

ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఒకటిరెండు సీన్స్ కాస్త సాగతీత అనిపించాయట. ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది అని ఉమైర్ అభిప్రాయపడ్డారు. మొత్తానికి జైలవకుశ బ్లాక్ బస్టర్ హిట్ అని, పూర్తి స్థాయి కుటుంబ కధా చిత్రమని సందు ప్రశంసించాడు.ఈ సినిమాకి ఆయన 5 కి గాను 3 . 5 రేటింగ్ ఇచ్చాడు. అదండీ రిలీజ్ కి ముందే బయటికి వచ్చిన జైలవకుశ రివ్యూ ,రేటింగ్ విశేషాలు.