పూరి జగన్నాధ్ కి నో చెప్పిన ఎన్టీఆర్

పూరి జగన్నాధ్ కి నో చెప్పిన ఎన్టీఆర్

మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చిత్రాలు ఏ రేంజ్ లో వుంటాయో అందరికి తెలుసు. సినిమా హిట్ అయినా ఫట్ అయినా యూత్ ని ఆకట్టుకోవడంలో పూరి స్టయిలే చాల డిఫరెంట్. అయితే ఎన్టీఆర్ కి కష్ట కాలంలో టెంపర్ చిత్రం హిట్ ని ఇచ్చింది. పూరి మేకింగ్ స్టైల్, డైలాగ్స్, సీన్స్ అన్ని చాల ప్రత్యేకంగా ఉంటాయి ఆ చిత్రంలో. అయితే ఆ చిత్రం తరువాత ఎన్టీఆర్ కి మరొక కథని చెప్పారట పూరి. దానికి నో చెప్పారట ఎన్టీఆర్. టెంపర్ హిట్ ఇచ్చిన పూరి జగన్నాధ్ కి నో చెప్పడానికి కారణం అందులోని హీరో పాత్రకి నత్తి వుంటుందట.

పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ చిత్రం లో విజయ్ నత్తి వున్న పాత్రలో కనిపించబోతున్నాడట. అయితే ఎన్టీఆర్ కి చెప్పిన స్టోరీనే విజయ్ తో చేస్తున్నాడా అని పలువురు చర్చలు జరుపుతున్నారు. అయితే ఎన్టీఆర్ జై లవకుశ చిత్రంలో నత్తి వచ్చే జై పాత్రలో నటించాడు. అయితే ఎన్టీఆర్ పూరి జగన్నాధ్ కి నో చెప్పి జై లవకుశలో నటించారు. అయితే ఎన్టీఆర్ పాత్రని విజయ్ కాపీ కొట్టబోతున్నాడా లేకపోతే పూరి స్టోరీలో పాత్రని ఎన్టీఆర్ కాపీ కొట్టాడా అనే విషయం ఫై చర్చలు జరుగుతున్నాయి. అయితే విజయ్ కూడా టెంపర్ చిత్రం లో ఎన్టీఆర్ తరహాలో మాస్ గా వుండబోతున్నాడా అని చర్చలు జరుగుతున్నాయి.