రెండో పెళ్లికి సిద్ధమైన మాజీ క్రికెటర్‌

రెండో పెళ్లికి సిద్ధమైన మాజీ క్రికెటర్‌

టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత బెంగాల్ రంజీ జట్టు హెడ్ కోచ్ అరుణ్ లాల్ 66 ఏళ్ల లేటు వయసులో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. అనారోగ్యంగా ఉన్న మొదటి భార్యను ఒప్పించి మరీ ఆయన ఈ కార్యానికి రెడీ అయ్యాడు. అరుణ్ లాల్.. తనకు చాలాకాలంగా పరిచయమున్న బుల్ బుల్ సాహ అనే మహిళ ను మే 2న మనువాడబోతున్నాడు. కోల్‌కతాలోని పీర్లెస్ ఇన్‌లో వీరి వివాహం జరుగనుంది. ఈ మేరకు అరుణ్‌ లాల్ ఇప్పటికే తనకు కావాల్సి వారికి ఆహ్వానం పంపాడు.

అరుణ్ లాల్.. అనారోగ్యంతో బాధపడుతున్న తన మొదటి భార్య రీనాకు చాలాకాలం క్రితమే విడాకులు ఇచ్చాడు. విడాకులు తీసుకున్నా మంచానికే పరిమితం కావడంతో ఆమె అరుణ్ లాల్‌తోనే జీవిస్తుంది. రీనాకు అరుణ్‌ లాల్‌ మనువాడబోయే బుల్ బుల్‌తో కూడా సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, అరుణ్‌ లాల్‌ భారత్ తరఫున 1982-89 మధ్యకాలంలో 16 టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. జాతీయ స్థాయిలో పెద్దగా రాణించలేకపోయినా అరుణ్‌.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మెరుగ్గా ఆడాడు. 156 మ్యాచ్‌ల్లో 30 శతకాల సాయంతో 10421 పరుగులు సాధించాడు.