గచ్చిబౌలిలో ఘోరమైన రోడ్డు ప్రమాదం

గచ్చిబౌలిలో ఘోరమైన రోడ్డు ప్రమాదం

నగరంలోని గచ్చిబౌలి బయో డైవర్సిటీ వద్ద ఓ కారు వంతెనపై నుంచి కింద ఉన్న మరో కారుపై పడింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడి అక్కడే మృతి చెందగా కారులో ఉన్న ముగ్గురికి, కింద ఉన్న ముగ్గురికి గాయాలు అయ్యాయి. కేర్‌ ఆస్పత్రికి క్షత గాత్రులను తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఫ్లై ఓవర్ కింద వేచి ఉన్న మహిళపై కారు పడడంతో అక్కడి అక్కడే ఆమె మృతి చెందింది. ఘటనా ప్రదేశానికి విషయం తెలుసుకున్న పోలీసులు అతి వేగం వల్ల కారు అదుపు తప్పి ప్రమాదం జరిగిందా అనే దాని గురించి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇది ఎత్తైన ఫ్లై ఓవర్ నుంచి కింద పడడంతో ఘటనా  ప్రదేశంలో ట్రాఫిక్ స్తంభించి కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది.