డైనోసర్ ఎంట్రీ కి 50 రోజులే ఉంది…సిద్ధమా..!

డైనోసర్ ఎంట్రీ కి 50 రోజులే ఉంది…సిద్ధమా..!
Cinema News

రెబల్ స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ డ్రామా సలార్. కేజీఎఫ్ సిరీస్ సినిమా లతో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ ఈ చిత్తానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే కేజీఎఫ్ 2 లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత డైరెక్టర్ చేస్తున్న మూవీ కావడంతో సినిమా పై భారీ హైప్ నెలకొంది.

డైనోసర్ ఎంట్రీ కి 50 రోజులే ఉంది…సిద్ధమా..!
Prabhas “Salaar “

ఈ సినిమా మరో 50 రోజుల్లో థియేటర్ల లోకి రానుంది. ఇదే విషయాన్ని మరోసారి మేకర్స్ వెల్లడించారు. డిసెంబర్ 22, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానున్న ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా  పృధ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి లు కీలక పాత్రల్లో నటించనున్నారు . ఈ పాన్ ఇండియా సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.