వైసీపీలో పీకే అలజడి

Pawan Kalyan Tensed YCP Leaders

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పీకే ఈ మాట వింటే చాలు వైసీపీ వణికిపోతుంది. గత ఎన్నికల్లో అనుకోని దుమారంలా వచ్చిన పీకే పవన్ కల్యాణ్ జగన్ పై విరుచుకుపడి తీవ్రస్థాయిలో ఆయనకు వ్యతిరేకంగా ఓఠ్లు పోలరైజ్ అవడానికి కారణమయ్యారు. జగన్ ను తిట్టడానికి చంద్రబాబైనా మొహమాటపడ్డారేమో కానీ.. పవన్ మాత్రం ఏకి పడేశారు. ఇప్పుడు మరో పీకే వైసీపీని భయపెడుతున్నాడు.

ప్రశాంత్ కిషోర్ సర్వేల పేరుతో వైసీపీ నేతలు బిక్కుబిక్కుమంటున్నారు. ఏ నిమిషం జగన్ నుంచి ఎవరికి పిలుపొస్తందో, ఎవరు బుక్కౌతారో తెలియక వణుకుతున్నారు. నియోజకవర్గ ఇంఛార్జ్ లు, సీనియర్లు, కొత్త క్యాడర్ అందరికీ పీకే అంటే వణుకే. జగన్ పీకేను బాగా నమ్ముతున్నారని, గత కీలక సమావేశంలో కూడా ఆయనతో మాట్లాడించడంతో ఆ విషయం అందరికీ రూఢీ అయింది.

అందుకే ఇప్పటిదాకా పార్టీని లైట్ తీసుకున్న వారు కూడా పీకే వచ్చాక యాక్టివ్ అయిపోయారు. అటు జగన్ కూడా ఈ పరిణామాల పట్ల సంతోషంగా ఉన్నారట. తన వల్ల కాని పని పీకే అయినా చేస్తున్నారని సన్నిహితుల దగ్గర అన్నారట. ఈ దెబ్బతో పీకే పాపులారిటీ పెరిగిపోగా.. వైసీపీ సీనియర్ల మనసులో రైళ్లు పరుగెడుతున్నాయి.