పవన్ కళ్యాణ్ “ఓజీ” రిలీజ్డే కి డేట్ ఫిక్స్!

పవన్ కళ్యాణ్ “ఓజీ” రిలీజ్డే కి డేట్ ఫిక్స్!
Cinema News

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఓజీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానుంది. దీనిపై మేకర్స్ త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకి రన్ రాజా రన్, సాహో ఫేమ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా కాలంగా పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న స్ట్రెయిట్ మూవీ కావడంతో మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అత్తారింటికి దారేది కూడా అదే తేదీన విడుదలైంది. పైరసీ అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ, అత్తారింటికి దారేది భారీ హిట్‌గా నిలిచింది.

పవన్ కళ్యాణ్ “ఓజీ” రిలీజ్డే కి డేట్  ఫిక్స్!
Pavan Kalyan OG

రిలీజ్ డేట్ సెంటిమెంట్ ఓజీకి పనికొస్తుందని పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు . బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రియాంక మోహన్‌ కథానాయిక గా నటిస్తుంది. ఈ మూవీ లో శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ మరియు వెంకట్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ మూవీ ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నారు.