ఆర్ఎక్స్ 100 హీరోయిన్ తో బాలయ్య

ఆర్ఎక్స్ 100 హీరోయిన్ తో బాలయ్య

ఆర్ఎక్స్ 100, ‘ఆర్‌డిఎక్స్ లవ్ సినిమాలతో గ్లామరస్ బ్యూటీగా మంచి పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పూత్ ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. వెంకీ మామ’, డిస్కో రాజా చిత్రాలలో నటించిన పాయల్ తాజాగా ఓ క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్‌ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

నందమూరి బాలకృష్ణ సరసన నటించే క్రేజీ ఛాన్స్ పాయల్ కొట్టేసిందని టాక్. బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మూవీలో హీరోయిన్‌గా పాయల్‌ను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో చిత్ర యూనిట్ పలువురు బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌లను సంప్రదించినట్లు టాక్ నడిచింది. అయితే ప్రస్తుతానికి వాళ్ల కాల్షీట్లు దొరక్కపోవడంతో పాటు రెమ్యూనరేషన్‌ కూడా భారీగా డిమాండ్ చేస్తుండటంతో చివరకు పాయల్‌ని ఓకే చేస్తున్నారని సమాచారం. అయితే త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా గతంలో ఎన్టీఆర్‌ జీవితాధారంగా క్రిష్‌ తెరకెక్కించిన ఎన్టీఆర్‌ కథానాయకుడులో పాయల్ జయసుధ క్యారెక్టర్‌లో నటించింది.