పొలిమేర 2 ప్రపంచవ్యాప్తంగా తాజా వసూళ్లు

పొలిమేర 2 ప్రపంచవ్యాప్తంగా తాజా వసూళ్లు
Cinema News

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్యం రాజేష్ హీరోగా టాలెంటెడ్ నటి కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాధ్ తెరకెక్కించిన ఇంట్రస్టింగ్ బ్లాక్ మ్యాజిక్ థ్రిల్లర్ సినిమా “పొలిమేర 2.” మరి ఈ సినిమా కి మొదటి భాగం “మా ఊరి పొలిమేర” ఓటిటి లో వచ్చి పెద్ద హిట్ కాగా దీనికి ఉన్న క్రేజ్ తో అయితే మేకర్స్ రెండో భాగాన్ని థియేటర్స్ లో రిలీజ్ కి తీసుకొచ్చారు.

పొలిమేర 2 ప్రపంచవ్యాప్తంగా తాజా వసూళ్లు
Polimera-2

మరి ఈ సినిమా అయితే థియేటర్స్ లో భారీ హిట్ కాగా అంచనాలు మించి మేకర్స్ కి మరియు డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి లాభాల ను తెచ్చి పెట్టింది. ఇక ఇప్పటికీ స్టడీ వసూళ్లు అందుకుంటున్న ఈ సినిమా మొదటి వారం రోజుల రన్ ని అయితే కంప్లీట్ చేసుకునే దిశగా వెళ్తుంది. మరి ఈ 6 రోజుల్లో ఈ చిత్రం 14.7 కోట్ల గ్రాస్ ని అందుకొని అదరగొట్టినట్టుగా మేకర్స్ చెప్తున్నారు. ఇక ఈ వారంలో కూడా నోటెడ్ తెలుగు రిలీజ్ లు లేవు కాబట్టి ఈ వీకెండ్ లో మళ్ళీ ఈ సినిమా కి మంచి వసూళ్లు దక్కే ఛాన్స్ ఉందని చెప్పాలి. మరి ఈ వీకెండ్ లో సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి.