ఓటిటిలో కి వచ్చేసిన “పొలిమేర 2”…..!

ఓటిటిలో కి వచ్చేసిన “పొలిమేర 2”.....!
Cinema News

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్యం రాజేష్ మెయిన్ లీడ్ లో నటించిన రీసెంట్ సినిమా “మా ఊరి పొలిమేర 2” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు డాక్టర్ అనీల్ విశ్వనాధ్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ డ్రామా థియేటర్స్ లో పెద్ద హిట్ అయ్యింది. మరి మొదటి భాగం ఓటిటిలోనే వచ్చినప్పటికీ నెక్స్ట్ సినిమా థియేటర్స్ లో మేకర్స్ రిలీజ్ చేసి పెద్ద సక్సెస్ ను అందుకున్నారు.

ఓటిటిలో  కి వచ్చేసిన “పొలిమేర 2”.....!
Ma Oori Polimera-2

మరి థియేట్రికల్ సక్సెస్ అనంతరం ఈ సినిమా ఇప్పుడు ఫైనల్ గా ఓటిటిలో అయితే వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు కొనుగోలు చేయగా అందులో ఈ సినిమా ఈరోజు నుంచి వచ్చింది. కానీ మొదట అయితే ఆహా గోల్డ్ సభ్యులకి మాత్రమే ఇప్పుడు ఈ సినిమా అందుబాటులో ఉంది. రేపు నవంబర్ 8 నుంచి అయితే ఈ సినిమా ఆహా సాధారణ సబ్ స్క్రిప్షన్ ఉన్నవారికి స్ట్రీమింగ్ కి రానుంది. మరి ఆహా గోల్డ్ ఉన్నవారు అయితే ఈరోజు నుంచే ఈ సినిమా చూడవచ్చు.