బర్త్ డే రోజున విదేశాల్లో విహరిస్తోన్న బుట్టబొమ్మ పూజాహెగ్డే……

బర్త్ డే రోజున విదేశాల్లో విహరిస్తోన్న బుట్టబొమ్మ పూజాహెగ్డే......
Movie News

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే వరుస సినిమాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఉంది పూజా హెగ్డే. నేడు ఈ అందాల భామ పుట్టిన రోజు. పూజా హెగ్డే పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియచేసారు . సోషల్ మీడియాలో పూజా హెగ్డే అభిమానులు సందడి చేస్తున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు తమ పుట్టినరోజున విదేశాలకు వెళ్లాలని చూస్తుంటారు. పూజా హెగ్డే తన పుట్టినరోజు సందర్భంగా మాల్దీవులకు వెళ్లింది. ఎంజాయ్ చేస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బర్త్ డే రోజున విదేశాల్లో విహరిస్తోన్న బుట్టబొమ్మ పూజాహెగ్డే......
Pooja Hegde

పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటో పోస్ట్ చేసింది. బీచ్ దగ్గర హాయిగా నిద్రపోతూ ఫోటోను షేర్ చేస్తుంది. ఈ ఫోటోకు ‘ప్రస్తుతం అందుబాటులో లేను’ అని రాసుకొచ్చింది. దీనిపై పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరు కామెంట్ బాక్స్‌లో పూజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.