ఏపీ లో భారీగా ఉన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

ఏపీ లో భారీగా ఉన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 10,199 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన ఈ పాజిటివ్ కేసుల తో మొత్తం 4,62,835 కి చేరింది. అదే తరహాలో గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 75 కాగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకు కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 4,200 కి చేరింది.

కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నా, కరోనా వైరస్ రికవరీ రేటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 9,499 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కరోనా 3,54,934 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 1,03,701 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.