శ్రీరాముడి గా ఆ పాత్రకి ప్రభాస్ న్యాయం చేస్తాడా ..??

శ్రీరాముడి గా ఆ పాత్రకి ప్రభాస్ న్యాయం చేస్తాడా ..??
Adipurush

“మర్యాద పురుషోత్తమ ప్రభు శ్రీరాముడి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే తాజా గా ప్రభాస్ ఆ మేరకు రాముడు రూపం లో మెప్పిస్తాడు అనే సందేహం వ్యతమౌతుంది. ఎన్టీ రామారావు కంటే ముందుగా ఒకరిద్దరు శ్రీరాముడి పాత్రలను పోషించినా, ఆ పాత్రకి ఆయన తీసుకొచ్చిన వైభవం వేరు. అసలు ఎన్టీఆర్ తరువాత శ్రీరాముడి పాత్రలో కనిపించడానికే ఎవరూ ముందుకు రాలేదు. ఆయనను కాకుండా మరొకరిని రాముడిగా చూడటానికి జనం పెద్దగా ఆసక్తిని చూపించలేదు.

శ్రీరాముడి గా కనిపించే అవకాశం హరనాథ్ కి ఎన్టీఆర్ ఇస్తే, ఆ పాత్రను పోషించే అవకాశం శోభన్ బాబుకి .. బాలకృష్ణకి బాపు ఇచ్చారు. ఇలా ఆ పాత్రలో చాలా కొద్దిమంది మాత్రమే కనిపించారు. అలాంటి పాత్రలో ఇప్పుడు ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ జనరేషన్ కి శ్రీరాముడిగా కనిపిస్తున్నది ప్రభాస్ మాత్రమే. పౌరాణిక చిత్రంలో నటించడం ఇదే ఆయనకి మొదటిసారి. అందువలన ఈ పాత్రలో ఆయన ఏ స్థాయిలో మెప్పిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.