మిగతా సూపర్‌స్టార్లకి మించిన రేంజ్‌ని ఎంజాయ్‌ చేస్తున్న ప్రభాస్‌

మిగతా సూపర్‌స్టార్లకి మించిన రేంజ్‌ని ఎంజాయ్‌ చేస్తున్న ప్రభాస్‌

ప్రస్తుతం ప్రభాస్‌ మిగతా సూపర్‌స్టార్లకి మించిన రేంజ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. ‘సాహో’ తెలుగు వెర్షన్‌ ఫ్లాప్‌ అయినా కానీ పాన్‌ ఇండియా స్టార్‌గా అతని మార్కెట్‌ని నిలబెట్టింది. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో ఒక దక్షిణాది హీరోకి వంద కోట్ల మార్కెట్‌ అనేది మాటలు కాదు. ప్రభాస్‌ రేంజ్‌ కనుక ఇప్పుడు మహేష్‌కో, తారక్‌కో, చరణ్‌కో వుంటే వారి అభిమాన సంఘాలు హంగామా చేసేసేవి.

ప్రభాస్‌ ఫాలోయింగ్‌ అంతా తరాల తరబడి వస్తోన్నది కాదు. కమ్యూనిటీ పేరు చెప్పి ‘క్షత్రియులు’ అభిమానిస్తారేమో కానీ ప్రభాస్‌కి ప్రధానంగా యువత, ఆడవాళ్లు, పిల్లలలో యమా క్రేజ్‌ వుంది. ఇప్పుడు కనుక సరిగ్గా ప్లాన్‌ చేసుకుంటే ఇక మిగతా హీరోలంతా ‘నాన్‌-ప్రభాస్‌’ రికార్డుల కోసం పోటీ పడాల్సి వస్తుంది. అయితే మిగతా హీరోలకి వున్నట్టు ప్రభాస్‌కి తగిన గైడెన్స్‌ లేదు.అలాగే తారక్‌ మాదిరిగా స్వీయ నియంత్రణ కూడా లేదు. ప్రభాస్‌ మంచి భోజన ప్రియుడే కాకుండా విలాస పురుషుడు. ఇటీవల అది మరింత ఎక్కువైపోయిందట.