ప్రభాస్ “కల్కి” ఇన్ని భాషల్లో రిలీజ్ కి భారీ ప్లానింగ్..?

ప్రభాస్ “కల్కి” ఇన్ని భాషల్లో రిలీజ్ కి భారీ ప్లానింగ్..?
Cinema News

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” తో తాను మళ్ళీ ఫామ్ లోకి రాగ ఈ మూవీ తో అయితే తన కెరీర్ లో రెండో అతి పెద్ద హిట్ ని తన ఖాతాల లో వేసుకున్నాడు. ఇక ఈ మూవీ అనంతరం ప్రభాస్ నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు వస్తుండగా ఈ చిత్రాల్లో టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ మూవీ “కల్కి 2898ఎడి” కూడా ఒకటి.

మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై వరల్డ్ క్లాస్ అంచనాలు కూడా ఉన్నాయి. ఇక దీనితో పాటుగా ఈ మూవీ పై మేకర్స్ మళ్లీ ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ మూవీ రిలీజ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తుంది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ని అత్యధిక భాషల్లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టుగా ఆల్రెడీ తెలిసిందే.

ప్రభాస్ “కల్కి” ఇన్ని భాషల్లో రిలీజ్ కి భారీ ప్లానింగ్..?
Prabhas ” Kalki”

కానీ ఎన్ని భాషల్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనే దానిపై ఒక టాక్ వైరల్ అవుతుంది. మేకర్స్ వరల్డ్ వైడ్ అయితే కల్కి ని 20 కి పైగా భాషల్లో ప్రెజెంట్ చేయబోతున్నారని వినిపిస్తుంది. ఇందులో ఇండియా లోనే పాన్ ఇండియా భాషలు సహా నార్త్ లో మరికొన్ని భాషల్లో కలిపి రిలీజ్ చేస్తారని టాక్. మరి వీటిపై ఇంకా అధికారిక క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ఇక ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.