సాహో స్టిల్ అంటూ ప్ర‌భాస్ ఫొటో వైర‌ల్…

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

 Prabhas sahoo movie first look

బాహుబ‌లిలో చ‌క్ర‌వ‌ర్తిగా క‌నిపించిన ప్ర‌భాస్… త‌ర్వాతి సినిమా సాహోలో ఎలా ఉంటారో అన్న ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. సాహో స్టిల్ అంటూ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ప్ర‌భాస్ ఫొటో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటోలో ప్ర‌భాస్ బూడిద‌రంగు ప్యాంట్ పై వైట్ క‌ల‌ర్ ష‌ర్ట్, మెడ‌లో స‌న్నని దండ వేసుకుని, జేబుల్లో చేతులు పెట్టుకుని న‌వ్వుతూ చూస్తున్నాడు. ఈ ఫొటోను చూసి అభిమానులు ప్ర‌భాస్ అందంపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. డార్లింగ్, చాలా బాగున్నావ్, సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్న సాహో వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కులు ముందుకురానుంది.

తెలుగు, హిందీ భాష‌ల్లో ఒకేసారి తెరెకెక్కుతున్న సాహోలో ప్రభాస్ స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్ న‌టిస్తోంది. సుజీత్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సాహోపై ఇటు టాలీవుడ్ లోనూ, అటు బాలీవుడ్ లోనూ భారీ అంచ‌నాలున్నాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్ హాలీవుడ్ సినిమాను త‌ల‌పించింద‌ని అంద‌రూ ప్ర‌శంసించారు. ఈ నెల 23 న ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సాహో ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తార‌ని భావిస్తున్నారు.

దీంతో పాటు అనేక విష‌యాల‌పై ఆ రోజు ప్ర‌భాస్ ప్ర‌క‌ట‌న‌చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల అనుష్క‌తో పెళ్లంటూ వ‌చ్చిన వార్త‌ల‌ను ఖండించిన ప్ర‌భాస్… ఇక‌పై ఇలాంటి రూమ‌ర్ల‌కు తావివ్వ‌కుంటా… త‌న పెళ్లి ఎవ‌రితో, ఎప్పుడు జరుగుతుందో ప్ర‌క‌టించే ఛాన్స్ ఉంద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అలాగే సాహో త‌ర్వాత‌, జిల్ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోయే సినిమా గురించి, క‌రణ్ జోహార్ తో చేయ‌నున్న బాలీవుడ్ ప్రాజెక్టు గురించి కూడా ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశ‌ముంది.