అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకోనున్న ప్రభాస్..?

Prabhas to marry American girl?

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ అని చెప్పాలి. ప్రభాస్ పెళ్లిపై వ‌చ్చిన పుకార్లు మరే హీరోపై ఇంత వరకు రాలేవు. గతంలో అనుష్క పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు తెగ హల్ చల్ చేశాయి. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని తర్వాత తెలిసింది.

అనంతరం మెగా డాటర్ నిహారికతో కూడా ప్రభాస్ వివాహం ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని ఇరువర్గాలు ఖండిస్తూ వచ్చాయి. తాజాగా 40వ వసంతంలోకి ప్రభాస్ అడుగుపెడుతున్న నేపథ్యంలో అతని పెళ్లిపై మళ్లీ వార్తలు షికారు చేస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ అమెరికాకు చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో వ్యాపారంలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కూతురితో ప్రభాస్ వివాహం జరగనున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ప్రభాస్ స్పందించాల్సి ఉంది. యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం హీరోగా నటించిన సాహో చిత్రం ఈ నెల 30న విడుదలకు సిద్ధంగా ఉంది.