ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ యొక్క భవిష్యత్తు..!

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ యొక్క భవిష్యత్తు..!
Cinema News

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ మూవీ సూపర్ సక్సెస్ అయింది ఈ మూవీ ని అందరూ మెచ్చుకుంటున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా సంక్రాంతి కానుకగా హనుమాన్ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. భారీ హిట్ ని అందుకుంది. ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూలలో పాల్గొని హనుమాన్ ను ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా అయినా కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. ముందు హనుమాన్ మూవీ తీయాలని అనిపించింది తర్వాత యూనివర్సిటీ బిల్డ్ అయింది అని అన్నారు.

ముందుగా ఒక్క మూవీ గురించే మేము ఆలోచించాము మన పురాణాల నుండి ఏ క్యారెక్టర్ తీసుకుని హీరోగా సెలెక్ట్ చేసుకోవాలి అని ముందు ఆలోచించాం. హనుమంతుడి పాత్ర అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆయన పవర్స్ ఆయన చేసే అల్లరి ఇదంతా కూడా ఆసక్తికరంగా ఉంటుందని.. ఇంద్రుడు ను ఇష్టపడే వాళ్ళు అలానే ఇష్టపడని వాళ్ళు ఉంటారు కానీ హనుమంతుడిని అందరూ ఇష్టపడతారని ఆయన అన్నారు