జైసింహా.. నిర్మాత ఓవర్‌ కాన్ఫిడెన్స్‌, మరి కాకుంటే ఏంటీ?

Producer C Kalyan is going to release Jaisimha in all locations
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి బాలకృష్ణ 102వ చిత్రం ‘జైసింహా’ విడుదలకు సిద్దం అయ్యింది. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఈ చిత్రంను అన్ని ఏరియాల్లో కూడా నిర్మాత సి కళ్యాణ్‌ విడుదల చేయబోతున్న నేపథ్యంలో సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బాలయ్య సినిమాపై ఎంత నమ్మకం ఉంటే మాత్రం అన్ని ఏరియాల్లో కూడా ఈయనే విడుదల చేయడం ఏంటనీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత సి కళ్యాణ్‌ ఆశించిన స్థాయిలో ఏ ఏరియాలో కూడా డిస్ట్రిబ్యూటర్‌ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదని, అందుకే తప్పని పరిస్థితుల్లో ఆయనే అన్ని ఏరియాల్లో విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఒక వేళ ఈ చిత్రం ఫలితం తారు మారు అయితే సి కళ్యాణ్‌కు కోలుకోలేని దెబ్బ పడటం ఖాయం అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. ఈ స్థాయిలో సి కళ్యాణ్‌ నమ్మకం పెట్టుకోవడంను కొందరు ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అంటూ కొట్టి పారేస్తున్నారు. బాలయ్య సినిమాపై ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో ఒక మోస్తరు అంచనాలున్నాయి. అయితే అదే సమయంలో పవన్‌ అజ్ఞాతవాసి చిత్రం విడుదల కాబోతుంది.

దాంతో జైసింహా చిత్రంపై ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. దాంతో జై సింహాను అన్ని ఏరియాల్లో సొంతగా విడుదల చేయడం అనేది సాహస నిర్ణయం అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం నిర్మాత సి కళ్యాణ్‌ చేస్తున్న ఈ సాహసం ఏ మేరకు సక్సెస్‌ అవుతుంది అనేది చూడాలి.