విజయ్‌ దేవరకొండకు పెద్ద కష్టం వచ్చింది

Producer KS Rama Rao Searching Heroine For Vijay Devarkonda

‘పెళ్లి చూపులు’, ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోల జాబితాలో చేరిపోయాడు. ఈయనతో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు, ఈయనతో సినిమాలు తెరకెక్కించేందుకు దర్శకులు క్యూలు కడుతున్నారు. తాజాగా యూవీ క్రియేషన్స్‌, గీతాఆర్ట్స్‌ల కాంబోలో తెరకెక్కిన ‘ట్యాక్సీవాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఆ తర్వాత గీతాఆర్ట్స్‌ 2 బ్యానర్‌లో రూపొందుతున్న ‘గీత గోవిందం’ అనే చిత్రంతో కూడా రాబోతున్నాడు. ఈ రెండు చిత్రాలు మాత్రమే కాకుండా ప్రముఖ నిర్మాత కేఎస్‌ రామారావు నిర్మాణంలో ఒక చిత్రాన్ని చేసేందుకు ఈయన కమిట్‌ అయ్యాడు.

సీనియర్‌ హీరోలతో సూపర్‌ హిట్స్‌ను తెరకెక్కించిన నిర్మాత కేఎస్‌ రామారావు తాజాగా సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా ‘తేజ్‌ ఐ లవ్‌ యు’ చిత్రంను చేయడం జరిగింది. ఆ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈసమయంలోనే విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఒక చిత్రంను చేసేందుకు కేఎస్‌ రామారావు ఏర్పాట్లు చేస్తున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం అవ్వాల్సి ఉంది. కాని హీరోయిన్‌ సెట్‌ అవ్వక పోవడంతో నెల రోజులుగా షూటింగ్‌ను వాయిదా వేస్తూ వస్తున్నారు. హీరోయిన్‌ కోసం కొత్త, పాత వారితో ఆడిషన్స్‌ జరుగుతున్నాయి. క్రాంతి మాధవ్‌ చిత్రంలో హీరోయిన్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే నటన తెలిసిన అమ్మాయి అయితే బాగుంటుందనే అభిప్రాయంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. విజయ్‌కి సెట్‌ అయితే పాత్రకు సూట్‌ అవ్వడం లేదు, పాత్రకు సూట్‌ అయితే విజయ్‌తో సెట్‌ అవ్వడం లేదు. దాంతో ఇప్పుడు విజయ్‌ దేవరకొండ మూవీకి హీరోయిన్‌ సమస్య వచ్చింది. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న క్రాంతి మాధవ్‌ ఈ చిత్రాన్ని ఇదే సంవత్సరంలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.