మెహ‌బూబా టీజ‌ర్ రిలీజ్…టీజ‌ర్ తోనే వావ్ అనిపించినా పూరి

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

puri Jagannadh ‘Mehbooba’ Teaser,

కొడుకు ఆకాశ్ హీరోగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న మెహ‌బూబా టీజ‌ర్ రిలీజ‌యింది. 1971 భార‌త్-పాకిస్థాన్ యుద్ధ నేప‌థ్యంగా వ‌స్తున్న ఈ రొమాంటిక్ ప్రేమ‌క‌థ‌లో ఆకాశ్ స‌ర‌స‌న బెంగ‌ళూరుకు చెందిన నేహాశెట్టి హీరోయిన్ గా న‌టిస్తోంది. పాక్..భార‌త్ స‌రిహ‌ద్దు గేటు తెర‌వ‌డం… యుద్ధంలో భాగంగా ఇరువైపులా కాల్పులు జ‌రుగుతుండ‌గానే..సైనికాధికారి గెట‌ప్ లో ఉన్న ఆకాశ్ నేహాశెట్టి చేయి ప‌ట్టుకుని పరుగెత్త‌డం టీజ‌ర్ లో క‌నిపిస్తోంది.

మెహ‌బూబా అంటూ వ‌స్తున్న బ్యాక్ గ్రౌండ్ సాంగ్, యుద్ధ విమానాలు, హెలికాప్ట‌ర్లు సినిమాపై ఆస‌క్తి పెంచుతున్నాయి. సంగీత‌ద‌ర్శ‌కుడు సందీప్ చౌతా ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఆకాశ్ ను ఎలాగైనా టాలీవుడ్ లో హీరోగా నిల‌బెట్టాల‌ని భావిస్తున్న పూరీ…మెహ‌బూబాను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు. స‌మ్మ‌ర్ లో మూవీ రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.