కొరియా ఓపెన్ ఫైనల్లో సింధు

pv-sindhu-enters-korea-open-final-faces-okuhara

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్ షిప్ ఫైన‌ల్లో ఓడిపోయిన పి.వి.సింధుకు ప్ర‌తీకారం తీర్చుకునే అవ‌కాశం వ‌చ్చింది. ఫైన‌ల్లో త‌న‌ను ఓడించిన జ‌పాన్ కు చెందిన ఒకుహ‌రాతో కొరియా ఓపెన్ ఫైన‌ల్ లో త‌ల‌ప‌డ‌నుంది సింధు. సెమీ ఫైన‌ల్లో సింధు ఆరోసీడ్, చైనా క్రీడాకారిణి హి బింగ్ జియావోపై విజ‌యం సాధించింది. ఫైన‌ల్ మ్యాచ్ ఆదివారం జ‌ర‌గ‌నుంది. ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ సింధు, ఒకుహ‌రా మ‌ధ్య హోరాహోరీగా సాగిన నేప‌థ్యంలో కొరియా ఫైన‌ల్ కోసం బ్యాడ్మింట‌న్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ లో గెలిచి సింధు గ‌త ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్ర‌పంచ చాంపియ‌న్ షిప్ ఫైన‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టికీ సింధు ఆట‌తీరుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింది. ఆమె పోరాట ప‌టిమ‌ను పొగుడుతూ సెలబ్రిటీలు ట్విట్ట‌ర్ లో కామెంట్లు పెట్టారు. ఈసారీ అలానే పోరాడి విజ‌యం సాధించాల‌ని అభిమానులు కోరుతున్నారు. సింధు కొరియా ఓపెన్ ఫైన‌ల్ చేర‌టం ఇదే తొలిసారి.